బషీర్ బాగ్ వెలుగు : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సందడిగా కొనసాగుతోంది. మంగళవారం లేడీస్డే సందర్భంగా కేవలం మహిళలనే అనుమతించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ప్రోగామ్స్ ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏడు కాలేజీల స్టూడెంట్లు పాటలు, డ్యాన్సులు, స్కిట్లతో అదరగొట్టారు.
రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నుమాయిష్ లో ఏటా ఒకరోజు మహిళలకు కేటాయించడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు లక్ష్య సాధన కోసం శ్రమించాలన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సీనియర్ మహిళా జర్నలిస్ట్ రత్నను ఘనంగా సత్కరించారు.