ప్రపంచ దేశాలు కొత్త సంవత్సరం వేడుకలకు సిద్దమవుతున్నాయి. ఈ సందర్భంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ( డిసెంబర్ 31) అర్దరాత్రి వరకు మెట్రో ట్రైన్స్ నడవనున్నాయి. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు రవాణా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా వెళ్లాలని కోరుకుంటున్నామని ఎల్ అండ్ టీ మెట్రో ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ ఉద్దేశంతోనే మెట్రో ట్రైన్ సేవలు పొడిగించినట్లు పేర్కొంది. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. ప్రజలు గమ్య స్థానానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడకుండా మెట్రో ట్రైన్స్ సమయాన్ని పొడిగించారు . నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్ల సమయాన్నిఈరోజు ( డిసెంబర్ 31) పొడిగించినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
<
Ring in the New Year with joy and peace of mind! ?✨
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) December 30, 2024
This New Year’s Day, Hyderabad Metro is here to make your celebrations smoother and safer. Our trains will run until 1st January 12:30 AM, ensuring you reach home hassle-free after the festivities. ?
Let’s step into 2025… pic.twitter.com/Iv2Iuh8VmU