సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్.. ఇద్దరు నిందితులు అరెస్ట్

  • హైదరాబాద్​లో కొట్టేసినరూ.8.15 కోట్లు రాజస్థాన్‌‌‌‌‌‌‌‌అకౌంట్​లో డిపాజిట్‌‌‌‌‌‌‌‌
  • 25 అకౌంట్స్‌‌‌‌‌‌‌‌పైదేశవ్యాప్తంగా 35 కేసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్​అకౌంట్స్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఇద్దరు ఏజెంట్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో అరెస్ట్ చేసి.. ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన  రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ కు ఈ ఏడాది జులైలో ఎస్‌‌‌‌‌‌‌‌ఐజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ పేరుతో వాట్సాప్‌‌‌‌‌‌‌‌ లింక్ వచ్చింది. స్టాక్‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలని నమ్మించి ట్రాప్‌‌‌‌‌‌‌‌ చేశారు. విడతల వారీగా రూ.8.15 కోట్లు కొట్టేశారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ను ట్రాక్ చేశారు.

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్​లోబాధితుడి డబ్బులు డిపాజిట్..

విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా విచారణ జరపగా రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని శ్రీ సన్వరియా ఫర్నిచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో రూ.75 లక్షలు డిపాజిట్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ అకౌంట్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో 25 అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయినట్టు సీఎస్‌‌‌‌‌‌‌‌బీ పోలీసులు గుర్తించారు. కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా గత నెలలో రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ చిట్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రవణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉదయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అకౌంట్‌‌‌‌‌‌‌‌ సప్లయర్స్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ డాంగీ(21), రాహుల్ భోయి(25)లను ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేశారు. గత వారం రాజాస్థాన్‌‌‌‌‌‌‌‌లో సోదాలు చేశారు. వీరి వద్ద నుంచి 3 సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్ తరలించారు. వీరు ఓపెన్ చేసిన 25 అకౌంట్స్‌‌‌‌‌‌‌‌లో 3.7 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదైన 32 కేసులతో ఈ అకౌంట్స్ కు లింక్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్టు తేల్చారు.