హైదరాబాద్, వెలుగు: మనదేశ మెట్రో సిటీల్లో రియల్ ఎస్టేట్‌కు అత్యంత అనువైన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కించుకుంది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ మెట్రిక్ (ఆర్ఈఐఎం) ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, మొత్తం డిమాండ్-సప్లై పరంగా బెంగళూరు అత్యంత అనుకూలమైన మార్కెట్‌గా నిలిచి 4.7 స్కోర్‌ను సాధించింది. హైదరాబాద్ 4.0 స్కోర్‌తో రెండవ స్థానంలో ఉంది.
ఇక్కడ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పాత స్టాక్ త్వరగా అమ్ముడవుతోంది. విలువ, ధరల పెరుగుదల అవకాశాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు, పూణే వంటి మార్కెట్‌లకు ఎంఓఎఫ్ఎస్ఎల్ అధిక వెయిటేజీ ఇచ్చింది. ఆర్ఈఐఎం ఫ్రేమ్‌వర్క్ పారామీటర్ల ప్రకారం ముంబై మార్కెట్బ్యాలెన్స్డ్గా ఉంది. జాతీయ రాజధానిలో పాత స్టాక్ ఎక్కువ ఉంది. ఇక్కడ పోటీ తీవ్రత కూడా తక్కువే. ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వకపోవడంతో కస్టమర్లకు డెవలపర్లపై నమ్మకం తగ్గుతోందని ఎంఓఎఫ్ఎస్ఎల్ తెలిపింది.
