హైదరాబాదీలు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‎కు వెళ్తున్నారా..? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు సమయం దగ్గర పడుతోంది. మరో 18 రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ఈవెంట్ నిర్వాహకులు వేడుకలకు ఏర్పాట్లు షూరు చేశారు. హైదరాబాద్‎లో న్యూ ఇయర్ వేడుకలు ఏ రేంజ్‎లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మందు, చిందులతో డిసెంబర్  31 రోజున నగరం దద్దరిల్లిపోతుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ కమిషరేట్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. 

న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకలు 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ముగించాలని.. స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేసే నిర్వాహకులు 15 రోజుల ముందే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఈవెంట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ALSO READ | Hyderabad Dishesh:ప్రపంచం మెచ్చిన ఫుడ్లో..హైదరాబాద్ బిర్యానీ..తినరా మైమరిచి..లొట్టలేసుకుంటూ

న్యూ ఇయర్ వేడుకలో డ్రగ్స్ వాడితే కట్టిన చర్యలు తీసుకుంటామని.. పబ్స్, ఈవెంట్స్‎లో అశ్లీల నృత్యలకు అనుమతి లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. పబ్స్, కెపాసిటికి మించి నిర్వాహకులు పాసులు జారీ చేయకూడదని.. 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ సౌండ్స్ పెట్టొద్దని ఆదేశించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఈవెంట్స్ నిర్వహకులు చూసుకోవాలన్నారు. 

లా అండ్ ఆర్డర్‎కు ఇబ్బందులు కల్గించవద్దని నిర్వాహకులు, ఈవెంట్స్‎కు వెళ్లే వారికి సూచించారు. ఈవెంట్స్‎లో సమయానికి మించి లిక్కర్ సప్లై చేయొద్దని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లే వారు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు వాడి చిక్కుల్లో పడొద్దని సూచన చేశారు.