- పుస్తక పఠనంతోనే జ్ఞానం సాధ్యం
- లోయర్ట్యాంక్ బండ్ నుంచి ఎన్టీఆర్స్టేడియం వరకు ‘పుస్తక నడక’
ముషీరాబాద్, వెలుగు: పుస్తకాలను చదవండి.. చదివించండి నినాదంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులు సోమవారం ‘పుస్తక నడక’ చేపట్టారు. స్కూల్విద్యార్థులతో కలిసి సోమవారం సాయంత్రం లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియంలోని బుక్ ఫెయిర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సీనియర్జర్నలిస్టులుకె.శ్రీనివాస్, అల్లం నారాయణ, అమర్, వేణుగోపాల్, విజయ్ కుమార్, ఐజీ రమేశ్, బుక్ఫెయిర్అధ్యక్ష కార్యదర్శులు యాకూబ్, వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని, ఎప్పటికీ పుస్తకం మాత్రమే జ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు.
లైబ్రరీల్లో పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. 37 ఏండ్లుగా బుక్ఫెయిర్నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే బుక్ఫెయిర్లో ‘నేను చేసిన న్యాయ వ్యవస్థ’ అనే పుస్తకాన్ని రచయిత, ప్రొఫెసర్మాడభూషి శ్రీధర్ ఆవిష్కరించారు. ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమంలో భాగంగా నచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకంపై యువ రచయితలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘సాయిబాబా స్మృతిలో అరుణతార’ను విరసం వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణ బాయి, రామదేవుడు, నందిని సిద్ధారెడ్డి, తయమ్మ, కరుణ, శివరాత్రి సుధాకర్ హాజరై ఆవిష్కరించి మాట్లాడారు.