ఢిల్లీ మెట్రో సౌకర్యాలు పరిశీలించిన హైదరాబాద్​ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండీ 

ఢిల్లీ మెట్రో సౌకర్యాలు పరిశీలించిన హైదరాబాద్​ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండీ 

ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తన బృందంతో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో సౌకర్యాలను పరిశీలించారు. ఢిల్లీ విమానాశ్రయం మెట్రో 23 కి.మీ. విస్తరించి ఉంది. కాగా ఆయన బృందంతో కలిసి ఢిల్లీ స్టేషన్​లో చెక్​ ఇన్, రీజనల్​ ర్యాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టమ్​ తో పాటు నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. డిపోలు, స్టేషన్​ లేఅవుట్లు, మెట్రో కోచ్​ల నిర్వహణ సౌకర్యాలు తదితర అంశాలపై అధ్యయనం చేశారు. కార్యక్రమంలో డీఎంఆర్​సీ ఎండీ వికాస్​కుమార్​, నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​ ట్రాన్స్​పోర్ట్​ కంపెనీ ఎండీ వీకేసింగ్​ తదితరులు ఉన్నారు.