Champions Trophy 2025: హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదల

  • 8 జట్లు.. 15 మ్యాచ్‌లు
  • పాకిస్థాన్, దుబాయి.. రెండు దేశాలలో మ్యాచ్‌లు
  • దుబాయిలో భారత జట్టు మ్యాచ్‌లు

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025  పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం(డిసెంబర్ 24) అధికారికంగా వెల్లడించింది. ఈ టోర్నీ హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనుంది. పాకిస్థాన్‌తోపాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు  ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరగనుండగా.. మిలిగిన జట్లు తలపడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి.

ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్

  • ఫిబ్రవరి 19: పాకిస్థాన్ vs న్యూజిలాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
  • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా  (నేషనల్ స్టేడియం, కరాచీ)
  • ఫిబ్రవరి 22:  ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
  • ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
  • ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • ఫిబ్రవరి 27: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
  • ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్  (నేషనల్ స్టేడియం, కరాచీ)
  • మార్చి 2: న్యూజిలాండ్ vs భారత్ (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • మార్చి 4: సెమీ-ఫైనల్ 1 (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
  • మార్చి 5:సెమీ-ఫైనల్ 2 (గడాఫీ స్టేడియం, లాహోర్)
  • మార్చి 9: ఫైనల్ (గడాఫీ స్టేడియం, లాహోర్)