ఊరెళ్లే విషయంలో భార్యతో గొడవ.. భర్త సూసైడ్

  • ఊరెళ్లి పోదామని ఒకరు.. ఇక్కడే ఉందామని మరొకరు
  • భార్యతో గొడపపడి భర్త సూసైడ్
  • బషీరాబాద్​ పరిధిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: ఆర్థిక సమస్యలతో భార్యతో గొడవపడి భర్త సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం బీమన్​పల్లికి చెందిన సైదులు (40) రెండు నెలల క్రితం తన భార్య సలోమీతో కలిసి ఉపాధి కోసం సిటీకి వచ్చాడు. మైసమ్మగూడలో ఉంటూ మల్లారెడ్డి బాయ్స్​ హాస్టల్​లో ఇద్దరూ క్లీనింగ్​పనిచేస్తున్నారు. వీరికి ఆర్థిక సమస్యలు ఉండడంతో బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 

ఇక్కడే ఉండి అప్పులు తీరుద్దామని భార్య, ఊరెళ్లి పోదామని భర్త గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన సైదులు హాస్టల్​లోని రూమ్​ నంబర్​ 207లో గడియ పెట్టుకొని పడుకున్నాడు. గురువారం ఉదయం 9.30 గంటల వరకూ సైదులు లేవకపోవడంతో హాస్టల్​లో పనిచేసే ఓ వ్యక్తి వెంటిలేటర్​ ద్వారా చూడగా, సీలింగ్​ ఫ్యాన్​కు లుంగీతో ఉరేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బషీరాబాద్ ఎస్ఐ ప్రవీణ్​ తెలిపారు.

  • పశువుల పాకలో ఉరేసుకొని యువకుడు..

ఇబ్రహీంపట్నం: ఆదిబట్లలోనూ ఓ యువకుడు పశువుల పాకలో ఉరేసుకొని మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్​గూడ గ్రామానికి చెందిన గజ్జెల తేజేశ్వర్ రెడ్డి(24) తన ఫ్రెండ్ బర్త్​డేకు వెళ్తున్నట్లు చెప్పి బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లాడు. 

గురువారం ఉదయం వరకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు తమ పొలం వద్దకు వెళ్లిచూశారు. అక్కడి పశువుల పాకలో తేజ ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.