
టాయిలెట్ క్లీనర్ అనగానే మొదట గుర్తొచ్చేది హార్పిక్. అందుకే ప్రతి ఇంట్లో, ఆఫీసులో, స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జ్‌లు, హోం స్టేలు... ఇలా ఒక్కటేమిటి? టాయిలెట్ ఉన్న ప్రతి చోట హార్పిక్ ఉండాల్సిందే. అసలు చెప్పాలంటే... టాయిలెట్ లేని చోటు ఉంటుందేమో కానీ, హార్పిక్ లేని టాయిలెట్ మాత్రం ఉండదు. ఎందుకంటే అది అంత పవర్ఫుల్ లిక్విడ్. ఎంత మురికిగా ఉన్న టాయిలెట్‌ని అయినా క్లీన్ చేస్తుంది. కాబట్టే, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ బ్రాండ్. ఆలోచిస్తే, హార్పిక్ లేని లైఫ్ స్టైల్‌ని ఊహించుకోవడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఏదేమయినా గానీ, హార్పిక్ వాడకం వల్ల అనారోగ్యాలకు దూరంగా హాయిగా బతికేస్తున్నారు ప్రజలు. అందుకు కారణమైన హార్పిక్ సక్సెస్ స్టోరీనే ఇది.
హార్పిక్.. వాడకం మొదలై వందేండ్ల పైనే. సెలబ్రెటీలు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రమోట్ చేస్తారు దీన్ని. ఈ వందేండ్లలో మార్కెట్లోకి ఎన్నో రకాల టాయిలెట్ క్లీనర్స్ వచ్చాయి. కానీ, వాటిన్నింటిలో కల్లా మొదటి స్థానం హార్పిక్దే. మరి అలాంటి సక్సెస్ఫుల్ జర్నీ చేసిన, చేస్తోన్న హార్పిక్ కథ ఎక్కడ మొదలైంది? ఎవరు కనిపెట్టారు? అనే విషయాల్లోకి వెళ్తే... హ్యారీ పికప్, బ్రిటిష్ శానిటరీ, హీటింగ్ ఇంజినీర్. లండన్‌లో నార్త్ యార్కషైర్‌లోని రోస్కోయిలో ఉండేవాడు. శానిటేషన్, టాయిలెట్స్ క్లీనింగ్ పనుల్ని ఎంతో ఇంట్రెస్ట్‌గా చేసేవాడు హ్యారీ. ఆ ఇంట్రెస్ట్ కాస్త హార్పిక్ కనుగొనేలా చేసింది. అదెలాగంటే.. ఆ టైంలో హ్యారీ లండన్‌లోని చాలా టాయిలెట్లను మెయింటెయిన్ చేసేవాడు. అప్పుడు ఒక సమస్య తన దృష్టికి వచ్చింది. వాటిలో వాడే నీళ్లు శుభ్రమైనవే అయినప్పటికీ టాయిలెట్ సీట్, రిమ్‌లు మురికిగా కనిపించాయి. ఈ సమస్య పెరగకుండా ఉండేందుకు సొల్యూషన్ ఆలోచించాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక, 1920లో లండన్ రాజధానిలో ఉన్న అన్నీ ఆయుధ కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలను తొలగించే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఒకరోజు ఆ పనిలో ఉండగానే ఒక గొప్ప ఆవిష్కరణ చేశాడు. ఆయుధాల కర్మాగారాల నుంచి పేలుడు పదార్థాల ఉప ఉత్పత్తులకు అద్భుతమైన సామర్థ్యం ఉందని గ్రహించాడు. ఆ వ్యర్థ పదార్థం పేరు నైట్రే కేక్. అదొక రసాయనం. దాన్ని నీటిలో కలిపినప్పుడు మిశ్రమం శక్తివంతమైన యాసిడ్‌గా ఏర్పడింది. అప్పటి నుంచి ఆ రసాయన ద్రావణాన్ని వాడుకలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత హ్యారీ యాసిడ్‌తో ప్రయోగాలు చేశాడు. నైట్రే కేక్‌ను కాఫీ గ్రైండర్తో పౌడర్‌గా తయారుచేసి, నీళ్లు కలిపాడు. టాయిలెట్లలో మురికిని తొలగించడానికి ఈ కెమికల్ బాగా పనిచేస్తుందని నమ్మాడు. అదే నిజమైంది. హ్యారీ గుర్తించిన ఆ సమస్యకు సొల్యూషన్ కనిపెట్టేశాడు.
తన పేరే బ్రాండ్‌గా..
హార్పిక్ అనేది హ్యరీ పికప్ పేరు నుంచి తీసుకున్నదే. తన ఒరిజినల్ ఫార్ములా చాలా మంచిది. సమాజానికి ఎంతో అవసరమైనది కూడా. అది 40 ఏండ్లపాటు అలానే కొనసాగింది. అయితే, దాని ప్రచారం కోసం హార్పిక్ టాయిలెట్ రోల్ కూడా లాంచ్ చేశారు. ఆ రెండు ప్రొడక్ట్స్ తక్కువ టైంలోనే ఎక్కువ అమ్ముడుపోయాయి. ఈ సక్సెస్ చూసిన ‘రెకిట్ అండ్ సన్స్ లిమిటెడ్’ కంపెనీ హార్పిక్ని కొనాలనుకుంది. అనుకున్నట్టే1932లో హ్యారీ నుంచి హార్పిక్‌ను కొన్నది. హ్యారీ కూడా బిజినెస్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. దాంతోపాటు డ్రైన్ క్లీనర్స్, కాస్ట్ ఐరన్ హీటింగ్ సిస్టమ్‌ల కోసం సీలాంట్స్, మ్యాన్‌హోల్ కవర్లను కూడా ‘లాక్ అండ్ లిఫ్ట్’ వంటి ప్రొడక్ట్స్ తయారుచేసేవాడు. ఏండ్లు గడిచేకొద్దీ, హార్పిక్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్‌తో ఇంకా ఎక్కువమందికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. హార్పిక్, టీవీతో సహా మీడియాను ఉపయోగించుకుంది.
మనదేశంలో..
‘రెకిట్ బెంకిజర్ గ్రూప్’ అనేది ఒక కన్జూమర్ గూడ్స్ కంపెనీ. దీనికి ఇంగ్లాండ్‌లోని స్లోఫ్లో మెయిన్ ఆఫీస్ ఉంది. ఈ కంపెనీ శానిటరీ, యుటెన్సిల్స్, హెల్త్‌కి సంబంధించి మెయిన్ ప్రొడక్షన్, సప్లైగా ఉంది. ఈ కంపెనీ 1999లో రెండు కంపెనీల విలీనంపై ఏర్పాటైంది. హార్పిక్ బ్రాండ్‌ను ఇండియాలో మొదలుపెట్టింది ఈ కంపెనీ. ప్రధానంగా టాయిలెట్లను శుభ్రపరిచే ఉద్దేశంతో తన మొదటి ప్రొడక్ట్‌ని మనదేశానికి పరిచయం చేసింది. మొదటి ఏడాదిలో టాయిలెట్ క్లీనర్ ఆలోచన కొత్తది కావడంతో మనవాళ్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మనవాళ్ల కోసం ..
కంపెనీ మొదట తమ ప్రొడక్ట్‌ల కోసం కస్టమర్స్‌ని టార్గెట్ చేసింది. మనదేశ మార్కెట్లో స్థానం సంపాదించాలంటే ముందు గృహిణులను ఆకట్టుకోవాలని అర్థం చేసుకున్నారు. అన్ని వ్యాపారాల్లో హార్పిక్ గృహిణులను టార్గెట్ చేసుకుంది. ఫ్యామిలీ హెల్త్ కోసం వాళ్లు బాగా ఆలోచిస్తారని, ఈ టెక్నిక్ వాడారు. గృహిణుల తర్వాత బ్యాచిలర్ అబ్బాయిలు, ఒంటరిగా ఉండే పెద్దల మీద దృష్టి పెట్టింది.
పక్కా ప్లానింగ్
బాటిల్ డిజైన్‌లో కూడా ఎంతో ప్లానింగ్‌తో ఉన్నారు ఆ కంపెనీవాళ్లు. కస్టమర్లు సులువుగా వాడుకునేందుకు వీలుగా బాటిల్‌ను తయారుచేశారు. టాయిలెట్ రిమ్‌ల లోతైన మూలాల్లో లిక్విడ్ పోయడానికి వీలు ఉంటుందని, బాటిల్ మెడ వంగి ఉండేలా డిజైన్ చేశారు. ఈ బాటిల్ డిజైనింగ్ దేశీ టాయిలెట్లకు సరిగ్గా సరిపోతుంది. ఈ విషయంలో వాళ్లు అనుకున్నట్టే సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఈ వంకర మెడ ఉన్న హార్పిక్ బాటిల్స్ ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో బాగా సేల్ అవుతోంది.
అవేర్నెస్ కోసం..
బాత్రూమ్లను శుభ్రం చేయడానికి హార్పిక్‌ను వాడమని ఎంకరేజ్ చేసేందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు మొదలుపెట్టారు. ఈ సమస్యను సాధారణ ప్రజలతో చర్చించడంలో కంపెనీ చొరవ తీసుకుంది. అపరిశుభ్రమైన బాత్రూమ్ల వల్ల జరిగే నష్టాలను ఎత్తి చూపేందుకు కంపెనీ ప్రదర్శనలను కంపెనీ ప్రదర్శించింది. అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా హార్పిక్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేసింది. ఆ తర్వాత డోర్ స్టెప్ ఛాలెంజ్‌ను మొదలుపెట్టారు. అక్కడ మహిళల గ్రూప్ ఒక వ్యక్తి ఇంటికి వచ్చి బాత్రూమ్ శుభ్రంగా ఉందో లేదో చెక్ చేస్తాడు. ఈ విమెన్స్ గ్రూప్ సాధారణ బ్లీచ్, యాసిడ్ వాడే కస్టమర్లను గుర్తిస్తుంది. కేరళ రాష్ట్రంలో రోజూవారీ టాయిలెట్‌ను శుభ్రపరచడం వల్ల కలిగే లాభాల గురించి అవేర్నెస్ కల్పించే ప్రయత్నంలో హార్పిక్ ఫ్రెష్ డైలీ క్లీన్ ఛాలెంజ్‌తో ముందుకు వచ్చింది. ఈ ఛాలెంజ్ కంపెనీని ఎక్కువ కాలం దృష్టిలో ఉంచుకోవడానికి సాయపడింది. ఆ తర్వాత టాయిలెట్ క్లీనర్లతో పాటు ఈ బ్రాండ్‌లో వైప్స్, టాబ్లెట్లు, టాయిలెట్ బౌల్స్, సిస్టెర్న్ బ్లాక్‌లు, బ్రష్ సిస్టమ్‌లు తీసుకొచ్చింది.