మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

అమ్రాబాద్, వెలుగు: మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. రూ.16,09,351 నగదు, 1,650 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో రంగాచారి తెలిపారు.

ఎండోమెంట్  ఇన్స్​పెక్టర్  వెంకటేశ్వరమ్మ, ఏపీజీబీ పదర బ్యాంక్​ మేనేజర్, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.