ఆధ్యాత్మికం: మనుషులు కూడా ముక్తిని పొందవచ్చు.. ఎలాగంటే

మునులు.. మహర్షులు .. ముక్తిని పొందేందుకు తపస్సు చేశారు.  అలా వారు లోకంలోని జరిగిన  విషయాలను.. జరగబోయే విషయాలను ముందే పసిగడతారు.  కాని మానవులు కూడా కొన్ని రకాలైన నియమాలను సాధన చేసుకొని ముక్తిని పొందవచ్చు.  ఇప్పుడు సామాన్య మానవులు ముక్తిని పొందేందుకు ఆచరించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. . 

ముక్తిని పొందాలనే మానవుడు కొన్ని సాధనలు చేయాల్సి ఉంటుంది.  ఒక సద్గురువును సమీపించి - వినయంతో ఆయనను ప్రశ్నించి ఆయన బోధను స్వీకరించాలి.అయితే గురువును చేరి ఆయనను సేవించి, .. పూజించితే ముక్తి వస్తుందా అంటే .. అంత తొందరగా సాధిచలేము. . గురువు ముక్తిని పొందేందుకు  మార్గాన్ని సూచిస్తాడు. ఆ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిన భాద్యత మనదే.   నిన్ను నీవే ఈ సంసారసాగరం నుండి ఉద్ధరించుకోవాలి. దానికై నిర్విరామంగా కృషి చేయాలి. ఉదాహరణకు స్కూల్లో టీచర్ పాఠాలు చెబుతాడు. వాటిని అర్దం చేసుకొని బుర్రలోకి ఎక్కించుకోవాల్సిన బాధ్యత మనదే.  అలా ఎక్కించుకున్న విషయాన్ని పరీక్షల వరకు గుర్తు పెట్టుకొని.. అడిగిన ప్రశ్నలకు కరక్ట్ గా రాసినప్పుడే కదా... మనం విజయం సాధించేది.

Also Read : తిరుప్పావై 18వ రోజు పాశురం.. ఓ నీలాదేవి ... కోళ్లు కూయుచున్నాయి

 ముక్తిని సాధించాలనుకొనే వారు ముందుగా వారి ఆలోచనను.. దృష్టిని సరి చేసుకోవాలి.  చాలామంది ముక్తికోసం ఆరాటపడుతూనే ప్రపంచాన్ని  రాగద్వేషాలు అనే రంగులతోకూడిన అద్దాల ద్వారా చూస్తున్నాం..  కొన్నింటిని ద్వేషిస్తాం.. కొన్నింటిని ప్రేమిస్తాం... కొన్ని ఇష్ట పడతాం.. మరికొన్నింటిని బాగా ఇష్టపడతాం. .  అంటే మనం ఆలోచించే ఆలోచనలో .. మన బుద్ది ప్రకారం మనం వాటిని చూస్తున్నాం. . 

మనకు ఇష్టమైన వ్యక్తి ఏం చేసినా.. ఏం మాట్లాడినా  అన్నీ మనకు బాగానే కనపడుతాయి.  అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా.. - ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. అతడు మంచిమాట మాట్లాడినా అందులో చెడు కనిపిస్తుంది. కనుక ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పడు మానవుడు .. సామాన్యులు ముక్తిని సాధిస్తారు. 

ఇలా అన్నింటిని సమ దృష్టితో చూసినపప్పుడు    మన మనస్సు ప్రశాంతంగా .. స్థిరంగా ఉంటుంది. అప్పడు  ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు.. ప్రతి వ్యక్తి  ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలా మన మైండ్ సెట్ మారినప్పడు.. ముక్తితో పాటు సుఖం.. ఆనందం .. సంతోషాలు కలుగుతాయి.   కాని అవి శాశ్వతం కాదు.. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని కోరిక, వ్యామోహం లేకుండా తటస్థంగా - నిర్లిప్తంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి ఉండదు.  అప్పుడు ఎటువంటి సంచలనం, ఆందోళన లేకుండా చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  అప్పుడు మానవుడు నిజమైన ముక్తిని పొందుతాడు. 

 మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు   కర్మలపై ఆసక్తి తగ్గిపోతుంది.   ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి గురువు చూపించిన మార్గంలో జ్ఞానాన్ని గ్రహించటానికి, సాధనలు చేయాలనే తపనతో ఉంటాం. ఇలా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం కృషి చేసే మనస్సు.. యోగంలో ఉన్నది అని చెప్పవచ్చు. మనస్సు ఇలా ప్రాపంచిక విషయాలవైపుకు భోగాల వైపుకు పరుగులు తీయకుండా స్థిరంగా - శాంతంగా ఉండి ఆత్మవైపుకు ప్రయాణం చేస్తుంటే యోగారూఢత్వంలో ఉన్నట్లే. ఆ విధంగా మనస్సును శుద్ధం చేసి ఉన్నత లక్ష్యం మీద నిలపటానికి కృషి చేయాలి..  అప్పుడే మానవుడు.. ముక్తి మార్గంలో పయనిస్తారు.