తిరుమలలో భక్తులు బస చేసే కాటేజీ ల మధ్య ఉన్న ఓ వృక్షంపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆ భారీ సర్పం కంట పడడంతో భయాందోళనకు గురై అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గంటసేపు ఉత్కంఠ నెలకొన్న అనంతరం ఎట్టకేలకు ఆ కొండచిలువను భాస్కర్ నాయుడు అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు.
ఆ పాము అక్కడ నుండి జారుకునేందుకు ప్రయత్నించగా.. వెంటనే స్నేక్ క్యాచర్ సురక్షితంగా పాముని పట్టుకుని సమీప అడవుల్లోకి వదిలేసారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే లాక్‌డౌన్ ప్రభావంతో కొద్దీ రోజులుగా జనసంచారం లేకపోవడంతో అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలతోను, క్యూలైన్‌లో వెళ్లి భక్తులతో ఎంతో రద్దీగా ఉంటుది. లాక్ డౌన్ ప్రభావంతో భక్తుల సంచారం పెద్దగా లేకపోవడం ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 
