సింగూర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ లోకి సోమవారం నుంచి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్‌లో మొదటి సారిగా 1270 క్యూసెక్కుల నీరు రావడంతో ఆఫీసర్లు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్ట్ లో523.600 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 519.595 మీటర్ల నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి 29.917 టీఎంసీలు కాగ 13.702 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.‌‌ -