స్మార్ట్ ఫోన్ జాతర: Samsung Galaxy 5G ఫోన్ భారీ డిస్కౌంట్..

Huge Discount on Samsung Galaxy 5G Mobiles:  హైటెక్ యుగం కాస్తా.. స్మార్ట్ యుగంగా మారిపోయింది.  ప్రస్తుత కాలంలో మూడేళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.  ఒకరోజు తిండి ... నిద్ర లేకపోయినా ఉంటారేమో గాని... ఒక్క క్షణం ఫోన్ లేకపోతే మాత్రం చిర్రెత్తిపోతారు.

  ఇక జనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని  స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రోజుకో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేస్తున్నాయి.తాజాగా Samsung Galaxy 5G Mobilesపై కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇటువంటి అవకాశం మళ్లీమళ్లీ రాకపోవచ్చు.  ఆఫర్, ధర, ఫోన్ ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌‌ఫోన్ కచ్చితంగా అందరి దగ్గర దాదాపుగా  ఉంటుంది. స్మార్ట్ అనేది అవసరంగా మారిపోయింది. అది లేకుండా రోజు గడవటం అనేది చాలా కష్టమనే చెప్పాలి. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ సైతం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని మొబైల్స్‌పై భారీ ఆఫర్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అనైలైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమోజాన్ సామ్‌సంగ్ Galaxy A05 ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది. దీని ద్వారా 50MP కెమెరా, 8GB RAM ఫోన్‌ను రూ. 7199లకే కస్టమర్లు దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్ సామ్‌సంగ్ ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. దీని కోసం కస్టమర్లందరూ పడిపోతారు. అయితే ఈ ఆఫర్లు లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లోని Samsung A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ అందుబాటులో ఉంది. Galaxy A05 ఫోన్‌ను రూ.7500 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Galaxy A05 బ్యాక్ ప్యానెల్‌లో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

అమెజాన్ Samsung Galaxy A05 ధరను కంపెనీ భారీగా తగ్గించింది. దాదాపు రూ. 10,000 ప్రారంభ ధరతో రిలీజ్ అయినప్పుడు ఈ ఫోన్‌ను రూ. 2,000 తక్కువ ధరతో సేల్‌కు తీసుకొచ్చింది. ఇప్పుడు దాని చాలా తక్కువగా మారింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో తగ్గింపు ధరతో లభించే Galaxy A05 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది.

Samsung స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 8GB RAM  +తో వస్తుంది. ఈ బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 7,999 తగ్గింపు ధరతో ఉంది. అయితే వినియోగదారులు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే, వారికి రూ. 800 వరకు తగ్గింపు ఇస్తుంది. దీని తర్వాత ఫోన్ కేవలం రూ.7,199 ధరకే దక్కించుకోవచ్చు.  అంతే కాకుండా ...పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.7,550 వరకు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు లభిస్తుంది. దీని వాల్యూ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను ఒకేసారి ఉపయోగించలేరు. సామ్‌సంగ్ Galaxy A05 ఫోన్ బ్లాక్, గ్రీన్,  సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.