యూనికార్న్​ క్లబ్​లోకి డార్విన్​ బాక్స్​  

యూనికార్న్​ క్లబ్​లోకి డార్విన్​ బాక్స్​  
  • యూనికార్న్​ క్లబ్​లోకి డార్విన్​ బాక్స్​  
  •  తాజాగా రూ.537 కోట్ల ఫండింగ్​

హైదరాబాద్, వెలుగు:  కంపెనీలకు హెచ్ఆర్​  ​ సేవలు అందించే హైదరాబాద్​ స్టార్టప్​ డార్విన్​ బాక్స్​ యూనికార్న్​ క్లబ్​లోకి చేరింది. తాజాగా దీనికి 72 మిలియన్​ డాలర్ల (దాదాపు రూ.537 కోట్లు) ఫండింగ్​ అందడంతో వాల్యుయేషన్​ బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫలితంగా యూనికార్న్​ స్టార్టప్​గా ఎదిగింది. హైదరాబాద్​లోని గచ్చిబౌలి ఆఫీసులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డార్విన్​ బాక్స్​ ఫౌండర్స్​ వివరాలను వెల్లడించారు. సేల్స్‌‌‌‌ఫోర్స్ వెంచర్స్, సీకోవియా ఇండియా, లైట్‌‌‌‌స్పీడ్ ఇండియా, ఎండియా పార్ట్‌‌‌‌నర్స్, 3ఇన్​డీఈవైట్, జేజీజీ వంటి పాత ఇన్వెస్టర్లతో పాటుగా నెట్‌‌‌‌ఫ్లిక్స్, మెటా, స్పాటిఫై , ఎయిర్​బీఎన్​బీ వంటి కంపెనీలకు మద్దతు​ ఇచ్చిన టెక్నాలజీ క్రాస్ఓవర్ వెంచర్స్ (టీసీవీ) ప్రస్తుత రౌండ్‌‌‌‌కు నాయకత్వం వహించిందని చెప్పారు.  ఈ రౌండ్​తో కలుపుకుంటే కంపెనీ ఇప్పటివరకు సేకరించిన మొత్తం పెట్టుబడి  110 మిలియన్​ డాలర్లకు (సుమారు రూ. 820 కోట్లు) చేరుకుంది. హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటైన మరో రెండు కంపెనీలు - జెనోటి, హైరేడియస్ కూడా - యూనికార్న్‌‌‌‌గా మారాయి, ఇవి మొదట హైదరాబాద్​లో బిజినెస్​ చేసి  అమెరికా వెళ్లాక యునికార్న్‌‌‌‌గా ఎదిగాయి. చైతన్య పెద్ది, జయంత్ పాలేటి,  రోహిత్ చెన్నమనేని అనే ముగ్గురు టెకీలు డార్విన్​ బాక్స్​ను 2015లో స్థాపించారు. ఈ స్టార్టప్​ను మొదలుపెట్టడానికి ముందు కార్పొరేట్‌‌‌‌ కంపెనీల్లో పనిచేశారు. ఒరాకిల్​, శాప్​లు అందించే హెచ్​ఆర్​ సేవలనూ డార్విన్​బాక్స్​ అందిస్తుంది. ఈ సెక్టార్​లో గ్లోబల్​ కంపెనీలకు గట్టి పోటీనిచ్చే ఏకైక భారతీయ కంపెనీ తమదేనని ఫౌండర్లు ప్రకటించారు. ‘‘ఈ తాజా ఇన్వెస్ట్​మెంట్​తో మా బిజినెస్​ మరింత ముందుకు వెళ్తుంది. మా కెపాసిటీని మరింత పెంచుకోగలుగుతాం. ఎంప్లాయ్​ మరింత బాగా, ఈజీగా పనిచేయగలిగేలా మేం టెక్నాలజీని తయారు చేశాం”అని జయంత్ ​ పాలేటి వివరించారు. 

అమెరికాలోనూ ఆఫీసు..
కంపెనీని విస్తరించడానికి కూడా ఈ డబ్బును వాడుతామని, ఇతర దేశాల్లోనూ సేవలు అందిస్తామని డార్విన్​బాక్స్​ ప్రకటించింది. ప్రొడక్ట్​, ఇంజనీరింగ్, కస్టమర్​ సక్సెస్​ టీమ్​లను బలోపేతం చేస్తామని ప్రకటించింది. సౌత్​ ఏషియా, సౌత్​ ఈస్ట్ ఏషియా, మిడిల్​ ఈస్ట్ కంట్రీల్లో బిజినెస్​ను పెంచుతామని వెల్లడించింది. ఇదే ఏడాది అమెరికాలోనూ కాలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్యను త్వరలో రెట్టింపు చేయనుంది. ఇప్పుడు 12 గ్లోబల్​ ఆఫీసుల్లో 700 మందికిపైగా పనిచేస్తున్నారు.  కంపెనీ ఇప్పటి వరకు 650 లార్జ్​ ఎంటర్​ప్రైజెస్​లకు సేవలను అందించింది. ఇది వర్క్​ఫోర్స్​ మేనేజ్​మెంట్​, ఎంప్లాయ్​ ఎంగేజ్​మెంట్​, కాంపన్సేషన్​ అండ్​ బెనిఫిట్స్​, పీపుల్ ఎనలిటిక్స్​, హెచ్​ఆర్​ సర్వీస్​ డెలివరీ సూట్స్​ వంటి సొల్యూషన్స్​ను అందిస్తుంది. మనదేశంలో ఇప్పటివరకు 83 స్టార్టప్​లు యూనికార్న్​లుగా ఎదగగా, డార్విన్​బాక్స్​ 84వ స్టార్టప్​. ఈ నెలలో ఎనలిటిక్స్ ఎస్​ఏఏఎస్ ​‘ఫ్రాక్టల్’, ఎడ్యుటెక్​ స్టార్టప్​ లీడ్​ స్కూల్​లకు యూనికార్న్​ హోదా వచ్చింది. అయితే హైదరాబాద్​లో తగిన వెంచర్​ క్యాపిటల్​ ఎకోసిస్టమ్​ లేకపోవడంతో సిటీకి చెందిన చాలా స్టార్టప్​లు బెంగళూరుకు మారుతున్నాయి. డార్విన్​ బాక్స్​ మాత్రం ఇక్కడి నుంచే సేవలు అందిస్తూ భారీగా నిధులను సంపాదించింది.