ఆయిల్ కంపెనీలు రిటైల్ ధరలు మార్చుకోవచ్చని చెప్పినా..

ఆయిల్ కంపెనీలు రిటైల్ ధరలు మార్చుకోవచ్చని చెప్పినా..

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు చాలా రోజులుగా పెరగకపోవడంతో హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోలియం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్​కు (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్​లో నికరంగా రూ. 10,196.94 కోట్లు నష్టం వచ్చింది. ఈ కంపెనీకి పోయిన ఏడాది ఇదే కాలంలో రూ. 1,795 కోట్ల నికర లాభం వచ్చింది. హెచ్​పీసీఎల్​తోపాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్​)లు ధరలను పెంచడానికి కేంద్రం ఒప్పుకోలేదు. ఇన్​ఫ్లేషన్​ను అడ్డుకోవడానికి పెట్రోల్,  డీజిల్ ధరలను మార్చలేదు. 
భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర సగటున109 డాలర్ల ఉండగా, రిటైల్ పంపు బ్యారెల్ ధర  85–-86 డాలర్లకు మించడం లేదు. ధరలు పెంచకపోవడంతో జూన్ క్వార్టర్​లో ఐఓసీ కూడా రూ. 1,992.53 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. హెచ్​పీసీఎల్​ కంటే చాలా పెద్దది అయినా  ఐఓసీకి నష్టం తక్కువగా ఉంది. ఎందుకంటే దీనికి క్రూడ్​ రిఫైనింగ్​, పెట్రోకెమికల్ వ్యాపారాలు ఉన్నాయి.  హెచ్​పీసీఎల్​ ఉత్పత్తి చేసే దానికంటే ఎక్కువ ఫ్యూయల్​ను అమ్ముతుంది.దీనిని రిఫైనరీల నుంచి మార్కెట్​ ధరలకే కొనాలి. సబ్సిడీ ధరలు వర్తించవు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో ఉత్పత్తుల అమ్మకం ద్వారా హెచ్​పీసీఎల్​ ఆదాయం రూ. 77,308.53 కోట్ల నుంచి రూ. 1.21 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, ఇప్పటి వరకు ఒక క్వార్టర్​లో ఇంత నష్టం రావడం ఇదే మొదటిసారని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపింది. రూపాయి విలువ తగ్గడంతో కార్పొరేషన్​కు రూ.945.40 కోట్ల ఫారెక్స్​ నష్టమూ  వచ్చింది. మార్కెట్​ రేట్ల ప్రకారం చమురు కంపెనీలు రిటైల్ ధరలను మార్చుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఇవి రేట్లను పెంచకుండా ఆపిందనే విమర్శలు ఉన్నాయి. ఐఓసీ, బీపీసీఎల్,​ హెచ్​పీసీఎల్​ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 137 రోజులపాటు రేట్లను పెంచలేదు. రష్యా ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేసిన తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరిగినా, దాదాపు 122 రోజుల నుంచి ధరలు మారడం లేదు.