కొత్త సంవత్సరం రాబోతుంది. ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే చాలు.. పబ్ లు.. పార్టీలతో హోటళ్లు.. రెస్టారెంట్లు బిజీ బిజీ అవుతాయి. తాగడం.. తినడం.. ఆ కాసేపు గంతులేస్తూ ఎంజాయి చేయడం.. ఇక ఆ తరువాత మొదలవుతాయి కడుపునకు తిప్పలు. కడుపులో వికారంగా ఉండటం.. తిన్న తిండి జీర్ణం కాక.. కొవ్వు పెరిగి జనాలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే డిటాక్స్ డ్రింక్ తాగితే కొవ్వు కరిగి... పొట్టలో ఏర్పడ్డ వికారం తగ్గుతుంది. బరువును తగ్గించే డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. .
ఏ రోజుకు ఆ రోజు బరువు తగ్గాలి. పొట్ట తగ్గాలి అని అనుకుంటూనే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తారు చాలామంది. అలా కాకుండా కొత్త సంవత్సరం (2025)లోనైనా దానికోసం ప్రయత్నించండి. .. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ కాస్తంత వ్యాయామం చేయాలి. అలాగే వాటితో పాటు ఒక డిటాక్స్ డ్రింక్ ను తాగండి.
ఒక కప్పు నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కొద్దిగా కలబంద గుజ్జు, పావు కప్పు కొత్తిమీర తరుగు, చిటికెడు మిరియాల పొడి... అన్నింటినీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ రసాన్ని వారం రోజుల పాటు రాత్రి పడుకునే ముందు తాగాలి. అలా చేస్తే ఒంట్లోని కొవ్వు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒంట్లోని హార్మోన్ల అసమతుల్యతను అరికడు తుంది. నిద్ర సరిగా పట్టేలా చేయడంతో పాటు కంటి, చెవి సమస్యలను దూరం చేస్తుందీ డ్రింక్. రోజంతా ఉత్సాహంగా ఉండేలా కూడా చేస్తుంది.
-వెలుగు,లైఫ్-