Beauty Tips : ఫటాఫట్.. 5 నిమిషాల్లో మేకప్ ఇలా చేసుకోవచ్చు

తక్కువ టైంలో మేకప్ పర్ఫెక్ట్ గా వేసుకునే టిప్స్ ఇవి...

• ఐ పెన్సిల్ డ్రైగా ఉంటే దాన్ని హ్యాండ్ డ్రైయర్ మీద కొంచెం సేపు పెట్టాలి. అప్పుడది మెత్తబడి, మేకప్ వేసుకోవడం ఈజీ అవుతుంది.

• జుట్టు జిడ్డుగా ఉంటే డ్రై షాంపూలతో తలస్నానం చేయాలి.

• గోళ్లకి రెగ్యులర్ నెయిల్ పాలిష్ బదులు జెల్ నెయిల్ పాలిష్ వాడాలి. ఒక్కోసారి నెయిల్ పాలిష్ డ్రైగా ఉండి, గోళ్లకి సరిగా అంటుకోదు. 

• అందుకే దాన్ని ఫ్రిజ్లో పావుగంట సేపు ఉంచాలి. ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేసుకుంటే బాగా వస్తుంది. 

• లిఫ్టిక్ ఎక్కువ సేపు ఉండాలంటే పెదాలపై ముందుగా ఫేస్ పౌడర్ పూయాలి. తర్వాత మ్యాటే బేస్డ్ లిఫ్టిక్ వేసుకోవాలి. 

• చెక్కిళ్లకి చీక్ టింట్స్ వాడాలి. 

• హెయిర్ సీరమ్ బాటిల్ ని ఎప్పుడూ క్యారీ చేస్తే... బయటికెళ్లినప్పుడు వెంట్రుకలు డ్రైగా అనిపించినప్పుడు వాడొచ్చు.