నెమలి కూర ఎలా వండాలి.. వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్.. అరెస్ట్ 

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలి..డబ్బులు, పేరు సంపాదించాలి అని యూట్యూబర్లు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతాకావు..రీల్స్ చేయడమనేది కొందరికి ఒక హాబీ అయితే..కొందరికి పేరు కావాలి.. డబ్బు కావాలి. దీనికోసం ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు.. టాలెంట్ ను నిరూపించుకోవడం మంచిదే.. పదిమందితో గ్రేట్ అనిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది.. కానీ లిమిట్స్ దాటి ఓవర్ చేస్తే.. ఇది గో ఇలా పోలీసు బాస్ లతో మర్యాదలు తప్పవుమరీ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యూట్యూబర్ .. వ్యూస్ లైకుల కోసం ఏం పనిచేశాడో తెలిస్తే .. మీరు ఔరా! అనాల్సిందే.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందని ఓ యూట్యూబర్ ప్రణయ్ కుమార్.. Sri TV పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఇతడి చానల్ కు , వీడియోలకు మంచి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు.. అయితే ప్రణయ్ కుమార్ కాస్త లిమిట్ దాటి ఏకంగా నెమలి కూర సాంప్రదాయబద్ధంగా ఎలా వండాలో జనాలకు నేర్పుతూ ఓ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.
 
ఏ కోడి కూరో.. మటన్ కూరో అయితే ఇంత గందరగోళం ఉండేది కాదు.. కానీ జాతీయ పక్షి నెమలి కూర వంటకం అని పోస్ట్ చేయడంతో వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.. జాతీయ పక్షిని పట్టడమే నేరం..అదీ కూరం వండటంఏంటీ..ప్రణయ్ కుమార్ ఇంత సాహసం చేశాడేంటీ.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయం పోలీసు బాస్ లకు తెలిసింది.. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ప్రణయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వండిన నెమలి కూరను స్వాధీనం చేసుకున్నారు. 

అయితే ప్రణయ్ కుమార్ నెమలి కూర వీడియో, అదుపులోకి తీసుకోవడం పై ఎఫ్ ఆర్వో కల్పనా దేవి స్పందిస్తూ.. ఇదంతా వట్టిదే.. ప్రణయ్ కుమార్ యూట్యూబ్ లో వ్యూస్ కోసం యూట్యూబ్ లో అప్ లోడ్ చేశానని చెబుతున్నాడు.నెమలి కూర అని పెట్టుకోవడం నేరం.. అయినా స్వాధీనం చేసుకున్న కూరను ల్యాబ్ టెస్ట్ కు పంపి స్తున్నామని క్లారిటీ ఇచ్చారు.