బిజినెస్ డెస్క్, వెలుగు: స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు ఆన్‌లైన్‌లోనే కేవలం నిమిషాల్లోనే లోన్లు ఇస్తోంది. ప్రీ-–అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (పీఏపీఎల్)గా పిలిచే వీటిని పొందడానికి ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే అందరికీ ఈ లోన్లు రాకపోవచ్చు. సెలెక్టెడ్ కస్టమర్లకు మాత్రమే ఈ లోన్లు అందుబాటులో ఉంటాయి. యోనో యాప్ ద్వారా స్టేట్ బ్యాంకుకు సంబంధించిన అన్నీ సేవలనూ పొందవచ్చు. "అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే ఎస్‌బీఐ కస్టమర్లు కేవలం నాలుగు మౌస్ క్లిక్‌లతో యోనో ఎస్‌బీఐ ద్వారా ఎప్పుడైనా పీఏపీ లోన్ తీసుకోవచ్చు" అని స్టేట్ బ్యాంక్ తెలిపింది. లోన్ దరఖాస్తు సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా బ్యాంకులు అందించే అప్పులను ప్రీ-–అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లు అంటారు. అయితే ఎంపిక చేసిన కేటగిరీ కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికే ఈ లోన్లు ఇస్తారు. ప్రాసెసింగ్ నిమిషాల్లో పూర్తవుతుంది. స్టేట్ బ్యాంక్ కస్టమర్లు567676కు “పీఏపీఎల్” అని ఎస్ఎంఎస్ చేస్తే లోన్‌కు అర్హులా కాదా ? అనే సంగతి తెలుస్తుంది. ఇలాంటి కస్టమర్ల పేర్లను స్టేట్ బ్యాంకు ముందుగానే సెలెక్ట్ చేసి పెడుతుంది. పీఏపీఎల్‌తోపాటు లోన్లపై మరో ఆఫర్‌ను కూడా అందిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు లోన్ తీసుకునేవాళ్లకు ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు.
లోన్ తీసుకోవడం చాలా ఈజీ
పండుగ ఆఫర్‌లో భాగంగా జనవరి 31, 2022 వరకు ప్రాసెసింగ్ ఛార్జీలలో 100 శాతం మినహాయింపు ఇస్తారు. పండుగ తరువాత కూడా ప్రాసెసింగ్ ఫీజు తక్కువగానే ఉంటుందందని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. - యోనో యాప్ ద్వారా లోన్ ప్రాసెస్ పూర్తవుతుంది కాబట్టి పేపర్ డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రాంచుకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ లోన్లపై వడ్డీ రేటు 9.60 శాతం కంటే తక్కువగా ఉంటుంది. - యోనో 24 గంటలు, వారంలో ఏడు రోజులు సేవలను అందిస్తుంది కాబట్టి కస్టమర్‌లు ఎప్పుడైనా ఈ లోన్‌ను పొందవచ్చు.
అప్లై చేయడం ఇలా..
లోన్ పొందడానికి ఈ నాలుగు స్టెప్‌లు ఉంటాయి
స్టెప్ 1: మీ మొబైల్ ఫోన్‌లో యోనో యాప్‌ని ఓపెన్ చేసి, లాగిన్ కోసం ఎంపిన్ లేదా పాస్‌వర్డ్ ఉపయోగించాలి
స్టెప్ 2: డ్రాప్ డౌన్ మెను నుండి, 'గెట్ నౌ' ఆప్షన్ ఎంచుకోండి
స్టెప్ 3: లోన్ కట్టాల్సిన నెలలు/సంవత్సరాలను ఎంచుకోండి
స్టెప్ 4: ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. కాసేపట్లో లోన్ మొత్తం మీ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.
