యూట్యూబర్​గా మారకముందు ఆర్కిటెక్ట్​గా పని​ చేశా

యూట్యూబర్​గా మారకముందు ఆర్కిటెక్ట్​గా పని​ చేశా

జ్యూస్​ షాపుకి మీతోపాటు కాగితం లేదా స్టీల్​ స్ట్రా పట్టుకుని ఎంతమంది వెళ్తారు? మీ పాత స్మార్ట్​ఫోన్​ లేదా కాఫీ కప్పు ప్లాస్టిక్​ మూతను ఎన్విరాన్​మెంట్​కి నష్టం కలగకుండా ఎలా డిస్పోజ్​ చేయొచ్చని ఆలోచించారా? చాలామందికి ఈ విషయాల గురించే పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం వీటి గురించి ఆలోచించి, ప్రాక్టీస్​ చేసి... నలుగురికీ ఆ విషయాల గురించి అవగాహన కలిగించడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు నయన ప్రేమ్​నాథ్​. అందుకే ఫోర్బ్స్​ ఇన్​ఫ్లుయెన్సర్​ జాబితాలో ఒకరుగా నిలిచింది. తన యూట్యూబ్​ జర్నీ రకరకాల మలుపులు తిరుగుతూ ఇక్కడ ‘సస్టెయిన్’​ అయ్యానంటున్న ఆమె మాటల్లోనే మిగతా వివరాలు...

‘‘మాది తిరువనంతపురం. కానీ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాం. యూట్యూబర్​గా మారకముందు ఆర్కిటెక్ట్​గా కొన్నాళ్లు పని​ చేశా. తరువాత డిజిటల్​ కంటెంట్​ క్రియేటర్​గా మారి, చివరకు లో–వేస్ట్​ ప్రాక్టీషనర్​ని​ అయ్యా. సస్టెయినబిలిటీ లైఫ్​ స్టయిల్​ ఎడ్యుకేటర్, కన్సల్టెంట్​, రైటర్​గా మారా. నా యూట్యూబ్​ జర్నీ గురించి చెప్పాలంటే డైరెక్ట్​గా ఒక సబ్జెక్ట్​ మీద మొదలుకాలేదు. స్టార్ట్​ అయిన దగ్గర్నించీ చాలా మలుపులు తీసుకుంది. మ్యూజిక్ కవర్స్​ చేసేదాన్ని మొదట్లో. ఆ తరువాత బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్​స్టయిల్​ వీడియోలు చేశా. అవన్నీ చేస్తూ ఫైనల్​ డెస్టినేషన్​ మాత్రం​ సస్టెయినబిలిటీ దగ్గరకి వచ్చి ఆగింది.

రెస్పాన్స్​ ఊహించలేదు

లో–వేస్ట్​ జర్నీ వీడియోలు మొదలుపెట్టినప్పుడు ఈ సబ్జెక్ట్​ మీద వీడియోలు ఎంతమంది చూస్తారు అనే అనుమానం ఒక మూల ఉండేది. అయినప్పటికీ నా మనసుకు బాగా దగ్గరగా ఉన్న ఈ టాపిక్​ను వదిలిపెట్టకూడదు అనుకున్నా. 2019 నుంచి లో వేస్ట్​ లైఫ్​ స్టయిల్​ జర్నీ మొదలుపెట్టా. ఒక్క యూట్యూబ్​లోనే కాకుండా... లింక్డిన్​, ఇన్​స్టా, వెబ్​సైట్​, బ్లాగ్​ అన్నింటిలో చాలామంచి రెస్పాన్స్​ వస్తోంది. పర్యావరణాన్ని దెబ్బతీయకుండా మనకు నచ్చినట్టు ప్రకృతితో కలిసి బతకొచ్చు. ఈ విషయాన్నే ప్రాక్టికల్​గా వ్యూయర్స్​, ఫాలోయర్స్​తో పంచుకుంటున్నా.

ఎకో – యూట్యూబర్​

లో వేస్ట్​ లైఫ్​ స్టయిల్​ జర్నీని ప్రమోట్​ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ లైఫ్​ స్టయిల్​ గురించి నాకు పూర్తి అవగాహన లేదు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని సాధ్యమైనంత వరకు నా రోజూవారీ జీవితంలో ప్రాక్టికల్​గా చేస్తూ అవేర్​నెస్​ తెచ్చుకుని నన్ను నేను ఎకో– యూట్యూబర్​గా మార్చుకున్నా. జీవితానికి ఒక అర్థం ఉండాలి అనుకున్నా. అలా నా మైండ్​సెట్​ మార్చుకుని సోషల్​ మీడియాను ఒక టూల్​గా చేసుకున్నా. కార్బన్​ ఫుట్​ప్రింట్​ ను తగ్గించి, ఎకో ఫ్రెండ్లీగా ప్రయత్నానికి దారులు వెతుకుతూ వాటి గురించి అవగాహన కల్పించే పని చేస్తున్నా. లో–వేస్ట్​ లివింగ్​, సెల్ఫ్​ ఎంపవర్​మెంట్​, బాడీ పాజిటివిటీ, ప్రొడక్టివిటీ, ఎథికల్ ఫ్యాషన్​, సెల్ఫ్​ కేర్​, ఆర్గానిక్​ స్కిన్​ కేర్​లను ప్రాక్టీస్​ చేస్తున్నా. ఈ మధ్య చాలామంది గ్రీన్​ లైఫ్​స్టయిల్​ ఫాలో అవుతున్నారు. అయితే ఈ ట్రెండ్ ఇంకా పెరగాలి.

బాడీ పాజిటివిటీ అవసరం

మెనుస్ట్రువల్​ కప్స్​ గురించి వీడియో చేయకముందు నా వెబ్​సైట్​ నయన ప్రేమ్​నాథ్​లో పోస్ట్​ చేస్తే వెబ్​సైట్​ ఫాలో అవుతున్న వాళ్ల నుంచి మంచి ఫీడ్​ బ్యాక్​ వచ్చింది. ఆ తరువాతే మెనుస్ట్రువల్​ కప్స్​ గురించి వీడియో అప్​లోడ్​ చేశా. ఈ వీడియో ద్వారా మెనుస్ట్రువల్​ కప్ వాడటం వల్ల కలిగే ఉపయోగం గురించి ఎక్కువమందికి చెప్పాలి అనుకున్నా. నా యూట్యూబ్​లో బాడీ పాజిటివిటీ మీద కూడా వీడియోలు చేశా. బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడాలంటే నేనే ఒక ఎగ్జాంపుల్. బక్కపలచగా ఉంటానని చాలాసార్లు బాడీ షేమింగ్​ ఎదుర్కొన్నా నేను. అప్పుడే నాకు బాడీ పాజిటివిటీ మీద దృష్టి పెట్టాలి అనిపించింది. సోషల్​ మీడియాలో వీడియోలు, షాట్స్​, రీల్స్​ చేయడమే కాకుండా లో–వేస్ట్​ లైఫ్​స్టయిల్​ గురించి సెషన్స్​ కూడా కండక్ట్​ చేస్తా. ఆ సెషన్స్​లో మన లైఫ్​స్టయిల్​లో ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్​ ఎలా వాడొచ్చో అవేర్​నెస్​ ఇస్తా. మన డెయిలీ లైఫ్​లో ఏ ప్రొడక్ట్​ వాడినా ఎన్విరాన్​మెంట్​కి హాని చేయనివి వాడాలి. అప్పుడే నెక్స్ట్​ జనరేషన్​కి నేచర్​ ఫ్రెండ్లీ జీవితాన్ని ఇచ్చిన వాళ్లం అవుతాం. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పోయినేడాది యూట్యూబ్​ వీడియోలు రెగ్యులర్​గా అప్​లోడ్​ చేయలేదు. కానీ ఇక నుంచి ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఒక కొత్త వీడియో అప్​లోడ్​ చేస్తా. షార్ట్స్​ అయితే వారానికి రెండు అప్​లోడ్​ చేస్తా.’’