కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైన ఎయిర్ పోర్ట్

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైన ఎయిర్ పోర్ట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం సిద్ధం చేస్తుంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం కష్టంతో కూడుకున్నది. ఇందుకోసం అన్నీ సిద్ధం చేసినట్లు ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ సీఈఓ విదేహ్ కుమార్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఎయిర్ పోర్ట్ లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాయనే అంశంపై బ్లూమ్ బెర్గ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేహ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు ఈవ్యాక్సిన్ ను తీసుకొని వెళ్లే సౌకర్యం లేదన్నారు. కానీ సాధారణంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్ చాలా అవసరం. మనదేశంలో సరిపడ కోల్డ్ స్టోరేజ్ లు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కీరోల్ ప్లే చేసే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 2నుంచి 8డిగ్రీల సెల్సియస్ లో సుమారు 2.7 మిలియన్ల వ్యాక్సిన్ బాటిళ్లను స్టోర్ చేసే సదుపాయంతో పాటు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ లో వ్యాక్సిన్ ను స్టోర్ చేసుకోవచ్చని విదేహ్ కుమార్ చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేలా ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.మనదేశం నుంచి చుట్టుపక్కల దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు.