దీపం అంటుకుని ఇల్లు దగ్ధం

కొడంగల్, వెలుగు: పూజగదిలో పెట్టిన దీపం అంటుకుని ఇల్లు దగ్ధం అయింది. ఈ  ఘటన కొడంగల్​ మండలం టెకుల్​కోడ్​లో ఆదివారం జరిగింది. బాధితురాలు యాదమ్మ పౌర్ణమి సందర్భంగా పూజలు చేసి కూలి పనికి వెళ్లింది. ప్రమాదవశాత్తు దీపం కింద పడి ఇంటికి నిప్పంటుకుంది. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఫైర్​ ఇంజన్​ వచ్చి మంటలను అదుపు చేసింది.   అప్పటికే ఇంట్లో ఉన్న బియ్యం, జొన్నలు, బట్టలు, రూ.30వేల నగదు, ఇతర సామగ్రి  కాలి బూడిదయ్యాయి. కూలి పని చేసుకుని బతికే యాదమ్మ రోదన అందరని కలిచివేసింది.