త్వరలో నిలోఫర్‌‌‌‌‌‌‌‌లో గుండె, ఈఎన్‌‌‌‌టీ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ : డీఎంఈ శివరాం ప్రసాద్

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్య శాఖ అకాడమీ డీఎంఈ శివరాం ప్రసాద్ తెలిపారు. నీలోఫర్ ఆస్పత్రిలోని చిన్నారులకు గుండె, ఈఎన్‌‌‌‌టీ వైద్య సదుపాయాలు లేకపోవడంతో వేరే ఆసుపత్రులకు తరలించాల్సి వస్తుందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల వైద్య చికిత్సలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని నిర్ణయించిందని చెప్పారు. 

ఈ మేరకు సోమవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీడియాట్రిక్ సెంటర్ ఏర్పాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి శివరాం ప్రసాద్‌‌‌‌ పరిశీలించారు. త్వరలో చిన్నారులకు గుండె, ఈఎన్‌‌‌‌టీ చికిత్సలను కూడా నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులో వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర కుమార్, హెచ్‌‌‌‌వోడీ భువనేశ్వర్, ఆర్‌‌‌‌‌‌‌‌ఎంఓ నాగజ్యోతితో పాటు తదితరులు ఉన్నారు.