హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు

అయిజ, వెలుగు: అయిజ పట్టణంలోని తిక్క వీరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో బుధవారం అంతర్రాష్ట్ర పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.  తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 30 పొట్టేళ్లు బల ప్రదర్శనకు వచ్చాయి.  ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు రసవత్తరంగా సాగాయి.  

మొదటి బహుమతి హైదరాబాద్ కిల్లర్ గ్రూప్ పొట్టేలు, 2 వ బహుమతి హైదరాబాద్ దక్కన్ షిప్ ఫైటర్స్ పొట్టేళ్లు గెలుచుకున్నాయి. 3వ బహుమతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గొందిపర్ల ప్రభాస్ పొట్టేలు, 4 వ బహుమతి నంద్యాల జిల్లా ఆంధ్ర కుంట్ల రమేశ్ పొట్టేలు గెలుచుకున్నాయి. యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.