సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలోని మాలలందరిని ఐక్యం చేసి డిసెంబర్1 న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సింహగర్జన సభను విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు సాకి ఆనంద్ సన్మానించారు.
శుక్రారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలసి రాష్ట్రంలోని మాలలందరిని ఒకే తాటి పైకి తెచ్చిన ఘనత మీకే దక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నవీన్, నటరాజు, కిషన్ పాల్గొన్నారు.