హ్యాండ్స్​​ ఫ్రీ వీల్​చైర్ : చేతులు ముడుచుకొని కూర్చుంటే చాలు

హ్యాండ్స్​​ ఫ్రీ వీల్​చైర్ :  చేతులు ముడుచుకొని కూర్చుంటే చాలు

హోండా కంపెనీ ఓ సరికొత్త హ్యాండ్స్​​ ఫ్రీ వీల్​చైర్​ను తయారు చేస్తున్నది. ఇది హోవర్​బోర్డులా పని చేస్తుంది. చేతులు ముడుచుకొని కూర్చుంటే చాలు.. మీరు ఏ వైపు వెళ్లాలనుకుంటే.. ఆ సైడ్​ తీసుకెళ్తుంది. ‘యునీ వన్’ పేరుతో దీన్ని తీసుకొస్తున్నది. అచ్చం రోబోటిక్​ చైర్​లా ఉంటుంది. కాళ్లు, చేతులు కదపలేని స్థితిలో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వెళ్లాలనుకునే దిశ.. వేగాన్ని కూడా అడ్జస్ట్​ చేసుకునే సౌలత్​ ఉంది. మీ శరీరం ఎటువైపు వంచితే.. అటు వెళ్తుంది. సెన్సార్​తో పని చేస్తుంది.

ఈ వీల్​చైర్​కు మొత్తం 4 టైర్లుంటాయి. కూర్చున్నప్పుడు రెండు లోపలికి పోతాయి. రెండింటిపైనే మూవ్​ అవుతూ ఉంటుంది. ఆపాలనుకున్నప్పుడు లోపలికెళ్లిన 2 టైర్లు బయటికొచ్చి చైర్​ను బ్యాలెన్స్​ చేస్తాయి. ఎక్కువ సేపు నడవలేకపోయే వారికి కూడా ఇది యూజ్​ అవుతుందని హోండా కంపెనీ చెప్పింది. పక్కనోళ్లతో మాట్లాడాలంటే కొన్ని చైర్స్​ను తిప్పాల్సి ఉంటుందని, కానీ హ్యాండ్స్​​ ఫ్రీ వీల్​చైర్​లో సెన్సార్​ కారణంగా ఈజీగా తిరుగుతుందని తెలిపింది. యునీ వన్​కు మినిస్ర్టీ ఆఫ్​ ఎకానమీ, ట్రేడ్​ అండ్ ఇండస్ట్రీ అవార్డ్స్​–2022లో గుడ్ డిజైన్​ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. ఇప్పుడు తైవాన్​లోని సుజుకా సర్క్యూట్ పార్క్​లో ప్రదర్శనకు ఉంచారు. ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బ్యాలెన్స్ కంట్రోల్ టెక్నాలజీ సెన్సార్‌‌ను కలిగి ఉంది.