వనపర్తిలో హోమ్​ ఓటింగ్​ షురూ

వనపర్తి, వెలుగు: పోలింగ్​ స్టేషన్లకు వెళ్లి ఓటు వేయలేని 85 ఏండ్లకు పైబడ్డ వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించగా, శుక్రవారం హోమ్​ ఓటింగ్​ ప్రారంభమైంది. వనపర్తి పట్టణంలోని గాంధీనగర్​కు చెందిన దివ్యాంగరాలు మాధవి, వల్లభ్​నగర్​లోని వయోవృద్ధురాలు బాలమ్మ (89) ఇండ్లకు వెళ్లిన సిబ్బంది వారిచే ఓటు వేయించారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 269 మంది హోమ్​ ఓటింగ్​ కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్​ తేజస్​నందలాల్​ పవార్  తెలిపారు. ఈ నెల 8 వరకు హోమ్​ ఓటింగ్​ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.