ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లును ప్రవేశ పెట్టారు హోంమంత్రి సుచరిత. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె ఇకపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్ష పడేలా చట్టం తీసుకొచ్చామన్నారు. అత్యాచార కేసులు నమోదైన తర్వాత 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజులో శిక్షపడుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఈ బిల్లులో ఉందన్నారు.మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడితే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా పడుతుందని చెప్పారు. ఒకసారి శిక్ష పడి మళ్లీ అదే తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు.
