న్యూఢిల్లీ: ఆన్లైన్లో లోన్లు పొందడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు హోమ్ క్రెడిట్ సర్వేలో తేలింది. మిలినియల్స్, యువతరం ఆన్‌లైన్‌వైపే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి మారేందుకు ఇష్టపడుతున్నట్లు 40 శాతం మంది బారోవర్లు చెప్పారని, ఇప్పటికే 15 శాతం మంది ఆన్లైన్ బాట పట్టారని పేర్కొంది. దేశంలోని 9 సిటీలలో 1200 మంది కస్టమర్లతో ఈ సర్వే నిర్వహించారు. కస్టమర్లు తీసుకున్న అప్పులు 2020 తో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం పెరిగాయి. ఇంటి అవసరాల కోసం చేసే అప్పులు మాత్రం తగ్గాయి. కరోనా వచ్చినప్పటి నుంచీ డిజిటలైజేషన్ ఊపందుకుందని సర్వే రిపోర్టు వివరించింది.
