హోలీ రోజు ఏ రాశి వారు ఏ రంగుతో పండుగ చేసుకోవాలో తెలుసా..

హిందువుల ప్రధాన పండుగ హోలీని ఈసారి మార్చి 25 న జరుపుకోనున్నారు. హోలికా దహనం మార్చి 24  , మార్చి 25 న హోలీ ఆడతారు. రంగులు కూడా మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. రంగులు వ్యక్తి జీవితంపై ఎంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయో, అవి కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. జన్మ రాశిని బట్టి రంగులు ఎంచుకుంటే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారం  ఈసారి హోలీ రోజున రాశిని బట్టి రంగులు ఎంచుకుని హోలీ ఆడితే ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే, అదృష్టం కూడా మారుతుంది. ఏ రాశి వారు ఏ రంగులతో  హోలీ ఆడుకుంటే అదృష్టమో తెలుసుకుందాం.

మేషరాశి: ఈ రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. కాబట్టి మేష రాశి వారు ఎరుపు రంగు వాడటం శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఎరుపు రంగు ప్రేమ, సత్యానికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటుంది. 

వృషభ రాశి: ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహాన్ని ప్రశాంతతకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే ఈ రాశి  వారు హోలీకి  ఊదా మరియు నారింజ రంగులను ఎంచుకోవాలి. ఈ రాశి వారు స్వభావరీత్యా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుక్రుడు పాలించే వృషభం భద్రత మరియు స్థిరత్వం వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ రాశి వారు పొరపాటున కూడా ఎరుపు రంగును వాడకూడదు.

మిధునరాశి: బుధుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారికి ఆకుపచ్చ రంగుతో హోలీని జరుపుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు. ఈ  రంగు  ఎల్లప్పుడ వారి  అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఆకుపచ్చ రంగు ప్రకృతిని సూచిస్తుంది. ఈ సందర్భంగా హోలీ పండుగ వేళ మిధున రాశి వారు గ్రీన్ కలర్ల వాడాలి. వీటితో పాటు సిల్వర్ కలర్ కూడా వాడొచ్చు. అయితే వీరు రెడ్, ఆరెంజ్ కలర్లను  అసలు వాడకూడదు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశి వారు హోలీ పండుగ రోజున  నీలం రంగులను ఎంచుకోవాలి.   ఈ రెండు కర్కాటక రాశి వారి  అదృష్టం పెరిగే అవకాశం ఉంటుంది.. వీరిది జల రాశి కావడం వల్ల బ్లూ కలర్ వీరికి లక్కీ కలర్‌గా ఉంటుంది.

సింహ రాశి : సూర్యుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు ఆరెంజ్ కలర్‌తో హోలీ ఆడాలని పండితులు చెబుతున్నారు. సింహరాశి వారికి ఈ రంగు చాలా మంచి చేస్తుందట.  హోలీ రోజు ఉదయం నిద్రలేచి, నీటిలో గులాబీ పువ్వులు వేసి సూర్య భగవానుడికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఆకుపచ్చ, నీలం రంగులు వాడితే అశుభ ఫలితాలొస్తాయి. 

కన్యారాశి : ఈ రాశి వారికి కూడా బుధుడు అధిపతిగా ఉంటాడు.  భూమి మూలకాన్ని సూచిస్తుంది. కాబట్టి హోలీ రోజున కన్య రాశి వారు పసుపు రంగులను ఉపయోగించి హోలీ జరుపుకోవాలి.  వీలైతే, ఈ రాశికి చెందిన వారు పండుగ రోజున తమ కుటుంబ సభ్యులతో తప్పక హోలీ ఆడాలి. అయితే ఈ రాశి వారు రెడ్, ఆరెంజ్ కలర్లను వాడకూడదు. ఈ రెండు రంగులు వాడితే అశుభ ఫలితాలొస్తాయి.

తులారాశి: ఈ రాశి వారిని శుక్రుడు పాలిస్తాడు. ఇది గాలి మూలకాన్ని సూచిస్తుంది. కాబట్టి హోలీ పండుగ వేళ వీరు నీలం మరియు కుంకుమపువ్వుతో హోలీ ఆడితే శుభప్రదంగా ఉంటుంది .  హోలీ రోజున ఈ రాశి వారు . ఈ రోజున మా లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం మర్చిపోవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రాశి వారు ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగులను వాడకూడదు.

వృశ్చికరాశి: ఈ రాశి వారిని అంగారకుడు  పాలిస్తాడు. వీరు హోలీ ఆడేందుకు ఏ రంగునైనా ఎంచుకోవచ్చు. అంగారకుడు  ఎరుపు గ్రహం అయినప్పటికీ, వీరికి అన్ని రంగులూ కలిసొస్తాయి.

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి హోలీ పండుగ వేళ పసుపు రంగును వాడాలి . ఎందుకంటే ఇది బృహస్పతిచే పాలించబడుతుంది ..  అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. పసుపు రంగు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది .  హోలీ వేడుకల సమయంలో దైవిక ఆశీర్వాదాలను తెస్తుంది. ఈ రాశి వారు  నీలి రంగు వాడకూడదు.

మకరరాశి: ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. మకరం భూమి మూలకాన్ని సూచిస్తుంది. కాబట్టి మకర రాశి వారు హోలీ పండుగను ఎరుపు, ఊదా (పింక్​)  గోధుమ రంగులతో జరుపుకోవాలి.  వీరు ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగులను వాడకూడదు. ఇవి అశుభానికి సంకేతంగా భావిస్తారు.

కుంభ రాశి : ఈ రాశి వారిని కూడా శని దేవుడే పాలిస్తాడు. కాబట్టి వీరు హోలీ సందర్భంగా లేత రంగులకు బదులుగా ముదురు రంగులను ఎంచుకోవాలి. ఇది వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది.  అలాగే ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్లను వాడకండి.

మీనరాశి: ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి హోలీ వేళ మీన రాశి వారు అకుపచ్చ, గులాబీ రంగులనే వాడితే శుభ ఫలితాలొస్తాయి.   హోలీ నాడు, వీరు పరమేశ్వరుడికి పసుపు రంగును సమర్పిస్తే, అది మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. అయితే హోలీ రోజున పొరపాటున బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్లను వాడొద్దు. ఇవి అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు.