హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించిన ఉంది.
ఎరుపు..
ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి 'హోలీ' ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
గులాబీ..
ప్రేమను తెలియజేసే రంగు ఇది. గులాబీ రంగుతో ఆనందం వెల్లివిరిస్తుం ది. మనిషికి మధురమైన భావనలను కలిగి స్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు.
పసుపు..
ఆధ్యాత్మిక భావనలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు.
కాషాయం..
ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగి స్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది.
నీలం..
దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని పెద్దలు చెప్తారు.
ఆకుపచ్చ..
ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరే కంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక. అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అం దిస్తుంది.
ఊదా..
పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం. నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రా జసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాల ను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది.
నలుపు..
రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగును మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు.