దేశంలో HMPV వైరస్ ఫస్ట్ కేసు.. అసలే సంక్రాంతి పండగ రద్దీ.. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం

చైనా, జపాన్ దేశాలను వణికిస్తున్న హ్యూమన్​ మెటాప్ న్యుమో వైరస్(HMPV)  ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. బెంగళూరు సిటీలో ఫస్ట్ కేసు నమోదు అయ్యింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గైడ్ లెన్స్ రిలీజ్ చేసింది. ఢిల్లీలోని అన్ని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని.. జనం వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వందనా బగ్లా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. అన్ని ఆస్పత్రుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది ఈ కమిటీ..

ఓ వైపు కర్నాటక రాష్ట్రంలో ఫస్ట్ హ్యూమన్​ మెటాప్ న్యుమో వైరస్(HMPV) కేసు నమోదు కావటం.. అది కూడా ఎనిమిది నెలల చిన్నారికి సోకటంతోపాటు ఢిల్లీలో హెల్త్ అలర్ట్ ప్రకటించిన క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ పై టెన్షన్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ స్టార్ట్ అయ్యింది. జనం అంతా సిటీ నుంచి ఊర్లకు.. గ్రామాల నుంచి సిటీలకు కోట్ల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదు. దీనికితోడు బెంగళూరు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఐటీ, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అందులోనూ సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో.. వేలాది మంది అటూ ఇటూ జర్నీ చేస్తూ ఉంటారు.

Also Read :- ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు

ఈ క్రమంలోనే హ్యూమన్​ మెటాప్ న్యుమో వైరస్(HMPV) వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్యూమన్​ మెటాప్ న్యుమో వైరస్(HMPV) సోకితే.. కరోనా లాంటి లక్షణాలే ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములతోపాటు జ్వరం వస్తుంది. శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవుతుంది. ఆక్సిజన్ ను అందించాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. జలుబుతోపాటు శ్వాస ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఈ లక్షణాలు ఉంటే జనంలో తిరగొద్దు.. ఎందుకంటే ఇది అంటు వ్యాధి.. మీ దగ్గు, తుమ్ముతో ఇతరులకు త్వరగా వ్యాపిస్తుంది. 

సో.. అసలే సంక్రాంతి పండుగ.. ఆపై కోట్ల మంది ప్రయాణాలు చేస్తుంటారు.. దీనికితోడు బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ రద్దీగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ పెట్టుకోండి.. సురక్షిత ప్రయాణం చేయండి.. వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి..