నాగపూర్లోనూ HMPV కేసులు:దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వైరస్

దేశవ్యాప్తంగా HMPV కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ( జనవరి 7)  ఉదయం తమిళనాడులో రెండు హ్యూమన్ మెటాఫ్న్యూమోవైరస్  (HMPV) కేసులు నమోదు అయ్యాయి. ఇదే రోజు మహారాష్ట్రలో కూడా కేసులు వెలుగు చూశాయి. నాగ్ పూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు  HMPV వైరస్ సోకినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో దేశంలో  HMPV కేసులు 7కి చేరాయి. 

చిన్నారులిద్దరికీ దగ్గ, జ్వరం లక్షణాలుగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన 9కేసుల్లో బెంగళూరు, నాగ్ పూర్, తమిళనాడులో రెండు చొప్పున, అహ్మదాబాద లో ఒక కేసు గుర్తించారు. 

HMPV వైరస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన శ్వాసకోశ సంబంధ వైరస్.. ఇది చైనాలో ప్రస్తుతం తీవ్రంగా ఉంది.ఇది అన్ని వయస్సుల వారిలో శ్వాస కోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. 

Also Read : HMPV వైరస్ విషయంలో చైనా మాటలు ఎంత వరకు నమ్మొచ్చు?

HMPV  పై కేంద్రం ప్రకటన 

HMPV కొత్త వైరస్ కాదని.. 2001లోనే దీని వ్యాప్తి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వింటర్,  వసంత రుతువ ప్రారంభంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.. ఇటీవల చైనాలో MHPV కేసుల వ్యాప్తి..ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ, ICMR , నేషనల్ సెంటర్ ఫర డీసీజ్ కంట్రోల్ చైనాతోపాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది..