- ఉరుస్తున్న తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుశ్నపల్లి జడ్పీ హైస్కూల్హెచ్ఎం ఠాకూర్ ఇందర్సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది. తరగతి గది ఉరుస్తుండడంతో స్టూడెంట్స్గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్న ఘటనపై కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలను గురువారం పరిశీలించారు.
మరో మూడు గదులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోకుండా ఉరుస్తున్న గదిలోనే స్టూడెంట్స్‌ను కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగా విద్యాశాఖను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలు తీయించి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయడంలో హెచ్ఎం ప్రమేయం ఉందని భావించి డీఈవో యాదయ్య శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తి అయ్యే వరకు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లరాదని పేర్కొన్నారు.
స్టూడెంట్స్‌కు ఇబ్బంది లేకుండా చూడాలి
వర్షాలు తగ్గే వరకు స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ టీచర్లను ఆదేశించారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పందించి.. స్కూల్తరగతి గదులను గురువారం పరిశీలించారు. ఉరుస్తున్నాయని తెలిసి కూడా స్టూడెంట్స్‌ను అక్కడే ఎందుకు కూర్చోబెడుతున్నారని టీచర్లను ప్రశ్నించారు. స్టాఫ్, ల్యాబ్రూమ్లతో పాటు డైనింగ్ హాల్లో స్టూడెంట్స్‌ను సర్దుబాటు చేయాలన్నారు.
వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతవరకు పిల్లలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. అనంతరం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వార్డెన్ లచ్చన్న విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలపడంతో.. ఐటీడీఏ పీవోకు చెప్పి షోకాజ్‌నోటీసు ఇప్పిస్తానని వార్డెన్‌ను హెచ్చరించారు. అలాగే నెన్నెల ఎంపీడీవో, తహశీల్దార్ ఆఫీస్, పీహెచ్‌సీలను ఆయన తనిఖీ చేశారు. ప్రజాపాలన, ధరణి హెల్ప్‌డెస్క్ నిర్వాహణ విధానాన్ని పరిశీలించారు.