నార్సింగిలో హిట్ అండ్ రన్ కేసు...స్పాట్లోనే యువకుడి మృతి

రంగారెడ్డి: నార్సింగి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే యువకుడు మృతి చెందాడు. గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. 

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసులు పెరిగిపోయాయి. జనవరి 24న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో  జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి మలుపు దగ్గర  అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న  తారక్ అనే వక్తి  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  దీంతో  కారు నడుపుతున్న వ్యక్తి... బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా పరారయ్యాడు. సంఘటనా స్థలంలో ఉన్న  సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.