మెదక్ జిల్లాలో హిట్ అండ్ రన్.. NH 161 హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బోడ్మాట్ పల్లి వద్ద NH161పై హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. శనివారం (నవంబర్ 16) రాత్రి రోడ్డు దాటుతుండగా మహిళను వేగంగా ఢీ కొట్టి కారు ఆపకుండానే వెళ్లిపోయింది. ఈ ఘటనలో సత్యమ్మ అనే మహిళా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మృతురాలి ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కారు ఢీకొట్టి ఆపకుండానే వెళ్లిపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు హైవేపై ఆందోళనకు దిగారు. 

దీంతో NH161పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హైవేపై ఆందోళనకు దిగిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడుతున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి న్యాయం చేస్తామని ఆందోళన విరమించాలని మృతురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. కాగా,  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.