ఎంబీఏ స్టూడెంట్లకు  ఫుల్ డిమాండ్‌

ఎంబీఏ స్టూడెంట్లకు  ఫుల్ డిమాండ్‌

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ, దేశంలో హైరింగ్ యాక్టివిటీ మెరుగుపడుతోంది. ముఖ్యంగా ఎంబీఏ స్టూడెంట్లకు మంచి శాలరీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. బిజినెస్‌‌‌‌‌‌లు  రికవరీ అవుతుండడం, వ్యవస్థలో పెంటప్ డిమాండ్ ఉండడంతో అన్ని సెక్టార్లలో  ఉద్యోగుల అవసరం పెరిగింది. యావరేజ్ శాలరీ రికార్డ్ లెవెల్స్‌‌‌‌కు చేరుకుంటోంది. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్ (ఐఐఎం) కోళికోడ్‌‌‌‌  స్టూడెంట్లకు కిందటేడాది కంటే 30 శాతం ఎక్కువ శాలరీ ఇచ్చి కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయి. భావన్‌‌‌‌ ఎస్‌‌‌‌పీజేఐఎంఆర్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు ఆఫర్ చేస్తున్న యావరేజ్ శాలరీ కిందటేడాదితో పోలిస్తే 23 శాతం ఎగిసి రూ. 32.05 లక్షలకు  పెరిగింది.  ఈ ఇన్‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌కు  వచ్చిన ఆఫర్లలో 59 శాతం ఆఫర్లు రూ. 30 లక్షల లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఐఐఎం ఇండోర్‌‌‌‌ స్టూడెంట్లకు యావరేజ్‌‌‌‌గా రూ. 25.01 లక్షలు ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ సారి స్టూడెంట్లకు ఆఫర్ చేసే హయ్యస్ట్ శాలరీ ప్యాకేజీ కూడా పెరిగింది. ఫారిన్‌‌‌‌లో జాబ్‌‌‌‌ కోసం అయితే ఎండీఐ గుర్గావ్​స్టూడెంట్లకు సుమారు రూ. 80 లక్షలు ఆఫర్ చేశారని ఎకనామిక్ టైమ్స్‌‌‌‌ పేర్కొంది. కిందటేడాది ఇలాంటి జాబ్‌‌‌‌ రోల్స్‌‌‌‌కు ఆఫర్ చేసిన రూ. 44 లక్షలతో పోలిస్తే ఇది  82 శాతం ఎక్కువ. ఐఐఎం కోళికోడ్‌‌‌‌ స్టూడెంట్లకు ఫారిన్‌‌‌‌లో చేసే జాబ్‌‌‌‌ల కోసం సగటున రూ. 61.5 లక్షలు ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి.  ఇది కిందటేడాది ఆఫర్ చేసిన రూ. 48 లక్షల కంటే 28 శాతం ఎక్కువ. ‘ క్యాంపస్ ప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌లు ఈ సారి చాలా బాగున్నాయి.  థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌కు కంపెనీలు భయపడడం లేదు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి హైరింగ్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంది’ అని ఎండీఐలో  గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను చూసుకునే అమిత్ కే గుప్తా అన్నారు.  గ్రాడ్యుయేట్‌‌‌‌ బ్యాచ్‌‌‌‌కు సగటున రూ. 25 లక్షలు ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు.  చాలా కంపెనీలు శాలరీ ప్యాకేజీలను పెంచాయని, కొన్ని సార్లు కంపెనీలను ఇన్‌‌‌‌స్టిట్యూట్లు నిరాకరించాల్సి వస్తోందని అన్నారు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా క్యాంపస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లు చేసే కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు ఈ సారి భారీగా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ను చేపడుతున్నాయని ఇన్‌‌‌‌స్టిట్యూషన్లు చెబుతున్నాయి. బాస్టన్ కన్సల్టింగ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌, బైన్‌‌‌‌ అండ్ కో, మెకెన్సీ అండ్ కో, కాగ్నిజెంట్‌‌‌‌, యాక్సెంచర్‌‌‌‌‌‌‌‌, పీడబ్ల్యూసీ, డెలాయిట్‌‌‌‌, అమెజాన్‌‌‌‌, ఐటీసీ వంటి కంపెనీలు ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లను చేపడుతున్నాయి. 

డిజిటలైజేషన్‌‌‌‌కు ప్రాధాన్యం

ఈ సారి కన్సల్టింగ్ కంపెనీలు ఎక్కువగా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ను చేపడుతున్నాయని ఐఐఎం. కోళికోడ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ క్వంబర్‌‌‌‌‌‌‌‌ అబిడి అన్నారు. ఫిన్‌‌‌‌టెక్ కంపెనీలు  కూడా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. ప్రొడక్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ జాబ్‌‌‌‌ రోల్‌‌‌‌కు డిమాండ్ ఫుల్‌‌‌‌గా ఉందని అన్నారు. కరోనా వలన డిజిటలైజేషన్‌‌‌‌ బాగా పెరిగిన విషయం తెలిసిందే.  తాజాగా జరుగుతున్న ప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌లలో  డిజిటలైజేషన్‌‌‌‌లపై కంపెనీలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ‘ఐటీ లేదా ఎనలిటిక్స్ సెగ్మెంట్‌‌‌‌లో జాబ్‌‌‌‌లకు డిమాండ్ ఉంది. ఫైనాన్స్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌, ఆపరేషన్స్‌‌‌‌, స్ట్రాటజీ వంటి సెగ్మెంట్‌‌‌‌లలో కూడా రిక్రూట్‌‌‌‌మెంట్స్ పెరిగాయి. గతంతో పోలిస్తే ఈ సారి డిజిటల్‌‌‌‌ జాబ్స్‌‌‌‌కు  కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని బట్టి ఇండస్ట్రీ ఫోకస్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు’ అని ఐఐఎం ఇండోర్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ హిమాన్షు రాయ్ అన్నారు.  ఐఐటీ కాన్పూర్‌‌‌‌‌‌‌‌లోని ఎంబీఏ స్టూడెంట్లకు ఆఫర్ చేస్తున్న శాలరీ ప్యాకేజీ ఈ సారి 22.5 శాతం పెరిగింది. ‘మొత్తం ప్లేస్‌‌‌‌మెంట్ ట్రెండ్‌‌‌‌ను చూస్తే  హైరింగ్ మార్కెట్ అప్‌‌‌‌ట్రెండ్‌‌‌‌లో ఉందని తెలుస్తుంది. జాబ్స్​ డిమాండ్​ పెరుగుతూనే ఉంది. కన్సల్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ సెగ్మెంట్‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌ ఫుల్‌‌‌‌గా ఉంది.  ఈ సారి కంపెనీలు ఆఫర్ చేసే శాలరీ ప్యాకేజీలు గతంతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఈ సారి ఎక్కువ మందిని కంపెనీలు రిక్రూట్‌‌‌‌ చేసుకుంటాయని నమ్ముతున్నాం’ అని ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌  కనగరాజ్ అన్నారు.