హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎల్‌‌‌‌‌‌‌‌లో టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ పోస్టులు

హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌ ఏరోనాటిక్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎల్‌‌‌‌‌‌‌‌) గ్రూప్​ డీ, సీ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ (గ్రూప్‌‌‌‌‌‌‌‌ డి, సి) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: మొత్తం 25 పోస్టుల్లో డిప్లొమా టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ (డి-6)- –6, ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ టెక్నీషియన్ (డి-6)-–17, ఆపరేటర్ (సి-5)- 2 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

విభాగాలు: మెకానికల్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌, ఎలక్ర్టానిక్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రికల్ వర్క్స్, స్ట్రక్చర్, గ్రైండర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయసు 31 జులై 2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. నెలకు గ్రూప్‌‌‌‌‌‌‌‌ -డి పోస్టులకు రూ.48,764; గ్రూప్‌‌‌‌‌‌‌‌ -సి పోస్టులకు రూ.46,796 చెల్లిస్తారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  రూ.200 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష సెప్టెంబర్ 22న నిర్వహిస్తారు. వివరాలకు www.hal-india.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.