హైనా దాడి..42 గొర్రెలు మృతి

  • సిద్దిపేట జిల్లా మాచాపూర్ లో ఘటన

సిద్దిపేట,(చిన్నకోడూరు), వెలుగు:  హైనా దాడి చేయగా గొర్రెలు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.  బాధితుడు తెలిపిన మేరకు.. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన మీసం మల్లయ్య తన గొర్రెల మందను గురువారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకలోకి తోలి ఇంటికి వెళ్లాడు.

శుక్రవారం ఉదయం వచ్చి చూడగా సుమారు 42 గొర్రెలు చనిపోయి కనిపించాయి. హైనా దాడి చేయడంతోనే మృతిచెందినట్టు గుర్తించాడు. సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆర్థికసాయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు బుచ్చయ్య, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ బాబు, ఉప సర్పంచ్ సురేశ్, రాజారెడ్డి ఉన్నారు.