శ్రీశైలం హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు

అమ్రాబాద్, వెలుగు :  నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో శ్రీశైలం సమీపంలోని పాతాళగంగ వద్ద హైదరాబాద్ – శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ వాహనాలు ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

విషయం తెలుసుకున్న ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ సిబ్బంది ఘటనా
స్థలానికి చేరుకొని రాళ్లను తొలగించారు. రోడ్డుపై రాళ్లు భారీగా ఉండడంతో సోమవారం శ్రీశైలం, హైదరాబాద్‌ రూట్​లో వేళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.