యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

కందనూలు, వెలుగు: కంది పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని  పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్  డైరెక్టర్  మల్లారెడ్డి తెలిపారు. శనివారం బిజినేపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కంది విత్తన మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు వ్యవసాయం చేయాలని సూచించారు. ఏడీ మల్లారెడ్డి, రమేశ్​చంద్ర,సైంటిస్టులు కేవీకే కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, వాణిశ్రీ, రాజశేఖర్  పాల్గొన్నారు.