ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సు ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతో పాటు రాయి విసిరారు. అది సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తాకి గాయం అయ్యింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం గాయపడ్డారు.
దాడి విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు యాత్ర జరుగుతున్న రామవరపాడు జంక్షన్ కు చేరుకున్నారు. జగన్ పై దాడి సమాచారం తెలుసుకున్న తర్వాత విజయవాడ సిటీలో పోలీసలు ఎక్కడిక్కడ మొహరించారు. పెద్ద ఎత్తున ఎవ్వరూ జమకూడకుండా చూస్తున్నారు. సిటీ అంతా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ ఆఫీసులు వద్ద, నేతల ఇండ్ల దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు పెంచారు.