కడప కౌన్సిల్ సమావేశం రసాభాస.. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవి రెడ్డి

కడప కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. గత కొంతకాలంగా మేయర్ సురేష్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం పీక్స్ కి చేరింది. గతంలో ఎమ్మెల్యే మేయర్ ఇంటిపై చెత్త వేయటంతో మొదలైన వివాదం కాస్తా తారాస్థాయికి చేరింది. గురువారం ( నవంబర్ 7, 2024 ) జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో తనకు చైర్ వేయకపోవడంతో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే మేయర్, కార్పొరేటర్లు బయటికి వెళ్ళిపోయారు.

మేయర్ వర్గం, ఎమ్మెల్యే వర్గం మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంతో కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి  స్పెషల్ ఇన్వైటిగా బారీ అనుచరులతో మీటింగ్ హాల్ లోకి రావడంతో అభ్యంతరం తెలిపారు వైసీపీ కార్పొరేటర్లు. ఎమ్మేల్యేకి చైర్ వయకపోవటంతో మేయర్ పై ద్వజమెత్తారు ఎమ్మెల్యే మాదవీ రెడ్డి.

ALSO READ : వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి నోటీసులు

ఇదిలా ఉండగా... కార్పోరేషన్లో ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశానికి టీడీపీ నాయకులు వచ్చి కూర్చుంటున్నారని భయంగా ఉందని వైసీపీ కౌన్సిలర్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో  కౌన్సిల్ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతించారు. అయితే.. ఎమ్మెల్యే వెంట భారీగా అనుచరులు రావటంతో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.