దుబ్బాకలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ..

దుబ్బాక: సిద్దిపేట జిల్లా  దుబ్బాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ నుంచి మున్సిపల్ ఆఫీస్​కు వెళ్తుండగా ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకున్నారు. పోటాపోటీగా కార్లపై  కోడిగుడ్లతో దాడులు చేసుకున్నారు.  దీంతో  కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

మంత్రి కొండా సురేఖ పై ట్రోలింగ్​ చేయడానికి ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డి కారణమని కాంగ్రెస్​ నాయకులు నిరసన తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు.  కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.