కేటీఆర్‌‌ పిటిషన్‌‌పై ఇవ్వాళ తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌‌పై హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ తీర్పు చెప్పనున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌‌ను అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తుకు సహకరించాలని కేటీఆర్‌‌ ను ఆదేశించింది. కాగా, ఈ పిటిషన్ పై పోయిన డిసెంబర్ 31న ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా.. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.