మీ పని కూడా కోర్టులే చేయాలా?..జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు మొట్టికాయలు

 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు నిర్వహించాల్సిన విధులను కూడా కోర్టులే చేయాలా అంటూ జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు నిలదీసింది. అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందించరని, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదులిచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులపై అధికారులు స్పందించకపోవడంతో బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా బేఖాతరు చేస్తున్నారని పేర్కొంది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టోలిచౌకిలో తమ దుకాణం ముందు మెట్లను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆరిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అబ్దుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సత్తార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. జీహెచ్ఎంసీపై హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విచారణ చేపట్టారు. పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపసంహరించుకుంటున్నామని పిటిషనర్  చెప్పగా జడ్జి అంగీకరించలేదు.

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో రాజీచేసుకున్నామని, పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఉపసంహరించుకుంటామంటే అనుమతించబోమని, అంతేగాకుండా జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ తరఫున సరైన సమాధానం లేకపోవడంతో జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇల్లంబర్తి గురువారం విచారణకు హాజరయ్యారు. కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి అక్రమ నిర్మాణాలపై ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి వాటికి అవకాశం లభిస్తోందన్నారు.   సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోర్టుల్లో కూడా స్టాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కౌన్సిళ్లు సహకరించకపోవడంతో ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ అవుతున్నాయని, వాటిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అక్రమ నిర్మాణంపై ఏం చర్యలు తీసుకున్నారో ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.