ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ధారణపై పూర్తి వివరాలివ్వండి..రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గుర్తింపును, ఇంకా గుర్తించాల్సిన వాటి వివరాలను అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిపికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు తీరుపై నివేదిక ఇవ్వాలంది.  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏలోని రామమ్మ కుంట ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటాలిటీ మేనేజిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణాలు చేస్తున్నదని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీన్ని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావులతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం విచారించింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదిస్తూ..హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 3,342 చెరువులున్నాయని కోర్టుకు తెలిపారు. వాటిలో  2,793 చెరువులకు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తింపునకు ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలువడిందన్నారు. మరో 708 చెరువులకు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇచ్చామని చెప్పారు. పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు తర్వాత మరో 57 చెరువులకు తుది నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలువరించామని వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ వివరాలను నమోదు చేసిన బెంచ్..విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించని ఆధికారులపై చర్యలు తీసుకోండి

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామంలో శివన్నగూడెం బ్యాలెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం భూసేకరణలో నిబంధనలు అమలు చేయని రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు చేతివాటం ప్రదర్శించారని, ప్రాజెక్టు కోసం సేకరించిన తన భూమికి పరి హారం చెల్లించాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన రాళ్ల శ్రీనివాసాచారి కోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు.

నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమిలో గ్రామ పంచాయతీ, మండల అధికారుల అనుమతితో నిర్మాణాన్ని చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉండగానే అధికారులు నిర్మాణానికి ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమి కోర్టు వివాదంలో ఉండగా ఆ భూముల్లో నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.