ప్రమోషన్లపై ఏపీ, తెలంగాణాలకు హైకోర్టు ఆదేశం

ప్రమోషన్లపై ఏపీ, తెలంగాణాలకు హైకోర్టు ఆదేశం
పోలీస్‌‌ ప్రమోషన్లలో అర్హులకు చాన్స్ ఇయ్యాలె తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీలకు ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ నాన్‌‌ కేడర్‌‌ పోస్టుల్లోని వాళ్లను కేటాయించినందున వారిలో అర్హత ఉన్న వాళ్లకు రెగ్యులర్‌‌ ప్రమోషన్స్‌‌ ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. టెంపరరీగా వచ్చారని చెప్పి తాత్కాలిక ప్రమోషన్స్‌‌ ఇవ్వడం కరెక్ట్ కాదంది. హైకోర్టులో పెండింగ్‌‌ కేసులతో సంబంధం లేకుండా రెగ్యులర్‌‌ ప్రమోషన్లు ఇవ్వాలని రెండు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమోషన్లు సీనియార్టీపై దాఖలయ్యే పిటిషన్లల్లో వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉండాలంది. తమ ఆర్డర్స్ అందిన తర్వాత 3 వారాల్లోగా అర్హులైన సీనియర్లకు ప్రయోషన్లు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌‌లు, డీజీపీలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులతో ప్రమోషన్లు పొందిన వాళ్లను రివర్షన్ చేయవద్దని, అలాగే కొనసాగించాలని చెప్పింది. సీనియార్టీ లిస్టుపై క్లారిటీ లేక రెండు రాష్ట్రాల్లోని నాన్‌‌కేడర్‌‌ పోస్టులను టెంపరరీగా కేటాయించారు.  జూనియర్లకు ప్రమోషన్స్‌‌ వచ్చి సీనియర్లకు  రాకుంటే వాళ్లకు బాధగా ఉంటుందంది. దీన్ని సరిచేయడం కోసం రెగ్యులర్‌‌ బేసెస్‌‌లో ప్రమోషన్స్‌‌ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. For More News.. కరోనా ఎఫెక్ట్: క్రిస్మస్, న్యూఇయర్​కు.. ఎవరింట్ల వాళ్లే కొలువుల కోసం ఓయూలో పోస్ట్ కార్డు ఉద్యమం సామాను తీసుకొని వస్తుండగా.. బైక్ పై వచ్చి యాసిడ్ దాడి